ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ

ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 8 వేల 218 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 17 వేల 776కి చేరింది.. 24 గంటల్లో కరోనాతో 58 మంది చనిపోయారు. మొత్తం కరోనా మరణాలు 5 వేల 302కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 81 వేల 763 యాక్టివ్ కేసులున్నాయి. 5 లక్షల, 30 వేల 711 మంది డిశ్చార్జ్ అయ్యారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 58 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, కృష్ణా జిల్లాలో ఏడుగురు, అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పిన మరణించారు. నెల్లూరు, ప్రకాశం,విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున చనిపోయారు...తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందగా... విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story