పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం..!

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం..!
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది. గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనా బారినపడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది. గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో నలుగురు ఏలూరు మండలం శనివారపుపేట హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉండడంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాఠశాలలో ఉన్న 650 మంది విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా టెస్టులు చేస్తున్నారు. మరోవైపు పాఠశాల మొత్తం శానిటైజేషన్ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం వరకు తరగతులు నిర్వహించడం లేదని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

Tags

Next Story