కరోనా కలకలం.. ఏపీ హైస్కూల్‌లో 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

కరోనా కలకలం.. ఏపీ హైస్కూల్‌లో 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో కరోనా కలకలం రేపింది.

కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో కరోనా కలకలం రేపింది. జెడ్పీ హైస్కూల్‌లోని 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. శుక్రవారం స్కూల్లో ర్యాండమ్‌గా కోవిడ్‌ టెస్ట్‌లు చేస్తే ఆ ఫలితాలు ఇవాళ వచ్చాయి. 10మందికి వైరస్ సోకినట్టు గుర్తించిన అధికారులు.. వారికి చికిత్స కోసం మందులు అందించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులతోపాటు టెన్త్ టీసీ తీసుకుని వెళ్తున్న విద్యార్థులు, పేరెంట్స్ ఇలా కొందరికి కరోనా సోకడంతో గ్రామంలో ఆందోళన మొదలైంది.

అటు, స్కూల్లో పరిస్థితిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్ష చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తరగతులు నిర్వహించడం సరికాదని నిర్ణయించి.. పాఠశాలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి మరికొద్ది రోజులు పొడిగిస్తామని మండల విద్యాశాఖ అధికారులు చెప్పారు. పెదపాలపర్రుతోపాటు గురజ ప్రాథమిక పాఠశాలలోనూ కోవిడ్ టెస్ట్‌లు చేశారు. 3వ తరగతి చదువుతున్న బాలుడికి వైరస్ సోకినట్టు నిర్థారించారు. మిగతా పిల్లలందరికీ కూడా టెస్ట్‌లు చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story