తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వైల్స్ మిస్సింగ్
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని విరవ పీహెచ్ సీ పరిధిలో మూడు కరోనా వ్యాక్సిన్ వైల్స్ మిస్సింగ్ అవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పిఠాపురం ప్రభుత్వాసుపత్రి నుంచి ఆరు కొవిడ్ వ్యాక్సిన్ వైల్స్‌ను విరవ పీహెచ్‌సీకి హెల్త్ సూపర్‌వైజర్ రమణ, పోలీసు కానిస్టేబుల్ సోమవారం తీసుకువెళ్లారు.
అక్కడకు వెళ్లిన గంటన్నర తర్వాత ఆరు వైల్స్‌లో మూడు పగిలిపోయినట్టు గుర్తించారు.ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సిబ్బంది నిర్లక్ష్యమా, రవాణాలో పగిలిపోయాయా తదితర కోణాల్లో విచారణ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన మూడో రోజునే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా వ్యాక్సిన్‌ను హెల్త్ సూపర్‌వైజర్ తీసుకువస్తుండగా మార్గమధ్యంలో బైక్ ప్రమాదానికి గురైన సమయంలో వ్యాక్సిన్ సీసా పగిలిపోయిందని విరవ పీహెచ్‌సీ వైద్యాధికారి డీఎంహెచ్‌వోకు నివేదిక పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com