ఏపీ స్కూళ్లలో కరోనా‌.. 12 మంది విద్యార్ధులు, నలుగురు టీచర్లకు వైరస్‌..

ఏపీ స్కూళ్లలో కరోనా‌.. 12 మంది విద్యార్ధులు, నలుగురు టీచర్లకు వైరస్‌..
X

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. నల్లజర్ల మండలం సింగరాజుపాలెం హైస్కూల్‌లో 12 మంది విద్యార్ధులు, నలుగురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడడం కలవరం రేపుతోంది. గత నెల 26న పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 4న ఫలితాలు వచ్చాయి. ఈలోపు మరెంత మందికి కరోనా సోకిందో అన్న ఆందోళన విద్యార్ధుల్లో నెలకొంది. తమ పిల్లలను స్కూల్‌కు పంపించడంపై తల్లిదండ్రులు పునరాలోచనలోపడ్డారు.

Tags

Next Story