ఆంధ్రప్రదేశ్

ఆక్వా రైతులకు కరోనా కష్టాలు.. సెకండ్ వేవ్‌ రూపంలో మరోసారి దెబ్బ తీసిన కోవిడ్..

కరోనా మహమ్మారి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులను కోవిడ్ వైరస్ మరోసారి దెబ్బ తీసింది.

ఆక్వా రైతులకు కరోనా కష్టాలు.. సెకండ్ వేవ్‌ రూపంలో మరోసారి దెబ్బ తీసిన కోవిడ్..
X

కరోనా మహమ్మారి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులను కోవిడ్ వైరస్ మరోసారి దెబ్బ తీసింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. మరోసారి ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నామని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యలను ఆక్వా రైతులు పెంచుతున్నారు.

రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేస్తుండగా.. చేపలను ఏపీలోని పలు జిల్లాలు, తెలంగాణతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కొన్ని రాష్ట్రాలు అంతరాష్ట్ర రవాణాను నిలిపివేశాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి నిలిచిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ తమను తీవ్రంగా దెబ్బ తీసిందని ఆక్వా రైతులు వాపోతున్నారు. సరైన ధరలు లేక ఎంతో కొంత రేటుకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని చెబుతున్నారు.

Next Story

RELATED STORIES