ఏపీలో దోపిడీ నిలయాలుగా ప్రైవేట్ పాఠశాలలు.. విద్యార్థుల ప్రాణాలను పట్టించుకోని కార్పొరేట్ విద్యాసంస్థలు

ఏపీలో దోపిడీ నిలయాలుగా ప్రైవేట్ పాఠశాలలు.. విద్యార్థుల ప్రాణాలను పట్టించుకోని కార్పొరేట్ విద్యాసంస్థలు
విద్యా దందా కోరలు చాచింది. కార్పొరేట్ స్కూళ్లు.. దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ధనదాహం.. తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పిచేస్తోంది.

విద్యా దందా కోరలు చాచింది. కార్పొరేట్ స్కూళ్లు.. దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ధనదాహం.. తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పిచేస్తోంది. కరోనా సమయంలో డబ్బే ధ్యేయంగా విద్యా విలువల్ని తుంగలోకి తోస్తున్నారు. ఫీజుల వసూళ్లపై పెట్టిన శ్రద్ధ విద్యార్థుల ప్రాణాలపై పెట్టడం లేదని ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలపై విమర్శలొస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లోని ప్రముఖ విద్యాసంస్థల వ్యవహారశైలి.. అటు విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను నివ్వెరపోయేలా చేస్తోంది. కరోనా కారణంగా.. విద్యా సంవత్సరంలో 30 శాతం మాత్రమే తరగతులు నిర్వహించగా.. ఫీజు వసూళ్లు మాత్రం 100 శాతం పెట్టుకున్నాయి కార్పొరేట్ స్కూళ్లు.

కరోనా కాలంలో విద్యార్థుల ప్రాణాల సైతం లెక్కచేయకుండా అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయి కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు. ఫీజుల కోసం డే స్కాలర్, హాస్టల్ విద్యార్థులను యాజమాన్యం వేధిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ దందాలో బోధనా సిబ్బందిని సైతం యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేస్తేనే సిబ్బందికి జీతాలంటూ కండీషిన్స్ పెడుతున్నాయట ప్రైవేట్ యాజమాన్యాలు. దీంతో అరకొర జీతాలతో కడు దయనీయంగా మారింది సిబ్బంది పరిస్థితి.

ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే కార్పొరేట్ యాజమాన్యాల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకపక్క ఏపీ ప్రభుత్వం బడులు తెరవకుండానే అమ్మఒడి పథకం అమలు చేసేసి.. కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో కుమ్మకై 100 శాతం ఫీజు వసూలుకు తెరలేపిందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా.. వాటిని పట్టించుకున్న ఒక్క విద్యాసంస్థ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యా సంస్థలను సొసైటీలుగా రిజిస్టరు చేయించి.. వేల కోట్ల విద్యా వ్యాపారం చేస్తున్నా .. పట్టించుకునే నాథుడేలేడని ఆరోపిస్తున్నారు.

కార్పోరేట్ దోపిడిలో ప్రభుత్వ పెద్దలకు వాటాలు దక్కటంతో.. అధికారంలోకి వచ్చినాకూడా ఏమీ పట్టనట్టు నటించటం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. దానికి కరోనా తోడవటంతో పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు అయ్యింది విద్యార్డులు, తల్లిదండ్రుల పరిస్థితి. కంచే చేను మేస్తే అన్న చందంగా వ్యవస్థలను కాపాడాల్సిన ప్రభుత్వం.. పట్టనట్టు వ్యవహరించటం పెను విషాదం. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి నిభంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్న విద్యా వ్యాపార యజమాన్యాలపై ఉక్కుపాదం మోపపకపోతే జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story