YSRCP : సజ్జల ట్రాప్ లో జగన్.. పార్టీలో కల్లోలం..!

వైసీపీ పార్టీలో కోటరీ రాజకీయం ఎప్పుడూ చర్చనీయాంశంగానే మారుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టే జగన్ చేస్తారని.. దాని వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని గతంలోనే ఎంతో మంది వైసీపీ నేతలు బయటకు వచ్చి చెప్పారు. అయితే ఇప్పుడు మావిగన్ అంటూ జగన్ చేసిన పసలేని ప్లాప్ ప్రకటన వెనక కూడా సజ్జలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన డైరెక్షన్ లోనే అమరావతిపై వైసీపీ బ్యాచ్ తప్పుడు ప్రకటనలు చేస్తోంది. ఇదే ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలకు నచ్చట్లేదంట. ఎందుకంటే అమరావతి జోలికి వెళ్తే పార్టీకి ఎంత నష్టం జరిగిందో ఆల్రెడీ చూశారు. కానీ ఇప్పుడు సజ్జల మళ్లీ రాజధాని జోలికి వెళ్లి పార్టీకి మరింత నష్టం తెస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారంట.
సజ్జల రాసిచ్చిన స్క్రిప్టు వల్లే.. జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. లక్ష ఎకరాలు కావాలని.. దానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ అవుతుందని చెప్పారు. కానీ ఆ లెక్కలు మొత్తం సజ్జల రాసిచ్చిన స్క్రిప్టే అంటున్నారు. గ్రోత్ కారిడార్ అంటే కూడా జగన్ కు అవగాహన లేదని.. అందుకే మావిగన్ అనే ప్లాన్ ను స్క్రిప్టును ఫాలో అయిపోయి ఏదేదో చెప్పేశాడని అంటున్నారు. ఇన్ని రకాలుగా తప్పుడు ప్రకటనలు చేయడం వల్ల జగన్ మీద ప్రజలకు రోజురోజుకూ నమ్మకం పోతోందని చెబుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు సజ్జల ట్రాప్ లో జగన్ పడటం వల్లే పార్టీకి ప్రజల్లో తీవ్ర నష్టం జరిగిందని.. ఇప్పుడు కూడా అలాగే జగన్ వ్యవహరిస్తే మరింత నష్టం తప్పదని చెబుతున్నారు వైసీపీ కార్యకర్తలు. సజ్జలను గుడ్డిగా నమ్మకుండా జగన్ సొంతంగా ఆలోచించి పార్టీ కోసం నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు. లేదంటే ఇంకో రెండు దశాబ్దాలు అయినా సరే వైసీపీ అధికారంలోకి రావడం కల అని అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
