ఏపీ సచివాలయం వద్ద కలకలం.. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్యాయత్నం

ఏపీ సచివాలయం వద్ద కలకలం.. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్యాయత్నం
X
పెట్రోల్ డబ్బాలతో వచ్చి సచివాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. పెట్రోల్ డబ్బాలతో వచ్చి సచివాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ తమ దగ్గర కోటి 50 లక్షలు తీసుకొని మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పొలం ఆన్‌ లైన్ చేస్తానని చెప్పి.. డబ్బులు తీసుకుని మోసం చేశారని బాధితుడు చెబుతున్నాడు.


Tags

Next Story