కరోనా సోకడంతో అంబులెన్స్‌లోనే మృతి చెందిన దంపతులు

కరోనా సోకడంతో అంబులెన్స్‌లోనే మృతి చెందిన దంపతులు

చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా సోకిన వృద్ధ దంపతులు వెంటవెంటనే గుండెపోటుతో మరణించారు. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలో ఈ ఘటన జరిగింది. అబ్దుల్ రెహమాన్, సైదానీ భార్య భర్తలు. కరోనా లక్షణాలు కనిపించడంతో వీరిద్దరూ పరీక్షలు చేయించుకొన్నారు. ఇద్దరికీ కరోనా సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో 108 అంబులెన్స్ లో క్వారంటైన్ కి తరలిస్తుండగా రెహమాన్ గుండపోటుతో చనిపోయాడు. భర్త మృతి చెందడంతో భార్య సైదానీ కూడ గుండెపోటుతో మరణించింది. ఇద్దరు కూడా క్షణాల వ్యవధిలోనే అంబులెన్స్ లోనే మరణించడంతో విషాదం నెలకొంది. కరోనా భయంతోనే వీరిద్దరూ మరణించినట్లు చెబుతున్నారు స్థానికులు.

Tags

Read MoreRead Less
Next Story