Narayana : మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలు పచ్చి నిజాలు : సీపీఐ నారాయణ

Narayana : ఇక నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్న ఏపీ మంత్రులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు సీపీఐ నాయకులు నారాయణ. రోడ్లపై గుంతలే లేవన్న మంత్రి రోజా గారి నియోజకవర్గానికి ఆయన స్వయంగా వెళ్లారు. ఇదిగో చూడండి రోజా గారూ మీ నగరి నియోజకవర్గంలోని రోడ్లు ఎంత అందంగా ఉన్నాయో అంటూ అసలు బండారం బయటపెట్టారు. అయణంబాకం ఊర్లోని రోడ్ల దుస్థితిని వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఏపీ , తమిళనాడు సరిహద్దు రోడ్లను సైతం పరిశీలించిన నారాయణ.... రెండు రాష్ట్రాల్లో రోడ్ల పరిస్థితిని వీడియో తీశారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని, తమిళనాడు రోడ్లు చక్కగా ఉన్నాయని తెలిపారు. రెండింటి మధ్య పోలికలు చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు.
ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తానంటూ ఘాటైనా వ్యాఖ్యలు చేశారు నారాయణ. కేటీఆర్ వ్యాఖ్యలు పచ్చినిజాలన్నారు. ఏపీలో రోడ్లు గతుకులమయం.. గుంతలమయం అంటూ మండిపడ్డారు. అలాగే అప్రకటిత విద్యుత్ కోతలూ ఉన్నాయని ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com