Srikakulam : గ్యాస్ ధరలపై సీపీఎం ఆందోళనలు

X
By - Manikanta |9 April 2025 7:30 PM IST
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై శ్రీకాకుళం జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్‌లను తాళ్లతో మెడకు బిగించుకుని నిరసనలు తెలిపారు. మరికొన్ని చోట్ల తలపై గ్యాస్ బండను మోస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్ భారం మోయమంటూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com