కరెంట్‌ ఛార్జీలను తగ్గించాలని సీపీఎం ఆందోళన

కరెంట్‌ ఛార్జీలను తగ్గించాలని సీపీఎం ఆందోళన
పెంచిన కరెంట్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఎం ఆందోళన చేపట్టింది.

పెంచిన కరెంట్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఎం ఆందోళన చేపట్టింది. ఐదు జిల్లాల ప్రధాన కేంద్రమైన EPDCL కార్యాలంతో పాటు అన్ని విద్యుత్‌ కార్యాలయాల ఎదుట సీపీఎం శ్రేణులు నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సర్దుబాటు పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదలపై భారీగా ఛార్జీలు పెంచిందంటూ మండిపడ్డారు. కేంద్ర, ప్రభుత్వ విధానాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలపై భారం వైసి కార్పోరేట్‌ సంస్థలకు లాభం చేకూర్చుతుందన్నారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో సర్కారు భారీగా దోపిడి చేస్తుందని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story