CRDA Act : మళ్లీ అమల్లోకి వచ్చిన సీఆర్డీఏ చట్టం 2014.. దీనివల్ల..!

CRDA Act : అమరావతి సీఆర్‌డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ ఏపీ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో రద్దు చేసిన సీఆర్‌డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ, ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్‌డీఏకు బదిలీ చేస్తున్నట్టు తాజా బిల్లులో ప్రస్తావించింది. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నట్టు తెలిపారు. తక్షణమే సీఆర్‌డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత కేంద్రం శివరామకృష్ణతో ఒక కమిటీ వేసిందని... క్యాన్సర్‌తో బాధపడుతూనే ఆయన ఏపీలో 13 జిల్లాలు ఉంటే 10 జిల్లాల్లో స్వయంగా పర్యటించి నివేదిక సమర్పించారన్నారు. ఉత్తమమైన రాజధానిగా నిలిచే ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్న ఆ కమిటీకి ఇచ్చిన నివేదికలో రాజధానిపై ఒక ప్రత్యేక ప్రాంతమని ఎక్కడా చెప్పలేదన్నారు. తెలంగాణ నుంచి విడిపోవటం వల్ల ఎదురైన చేదు అనుభవాలు భవిష్యత్‌లో ఎదురుకాకుండా ఉండాలంటే పాలనలో వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణ కమిటీ నివేదిక స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com