Crime: గుంటూరులో డబుల్ మర్డర్

డబుల్ మర్డర్‌తో గుంటూరు నగరం ఉలిక్కిపడింది. వేర్వేరు చోట్ల ఇద్దరు వాచ్‌మెన్‌లను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. నల్లపాడు ఇన్నర్ రింగ్‌రడ్డుసమీపంలోని యమహా షోరూమ్ వాచ్‌మెన్‌ను గొంతు కోసి చంపేశారు. కుర్చీలో కూర్చుని ఉండగానే చంపేసినట్లు కనిపిస్తోంది. అటు అరండల్‌పేటలోని లిక్కర్ మార్ట్ వద్ద మరో వాచ్‌మెన్‌ను చంపేశారు. డబుల్ మర్డర్ సమాచారం అందుకున్న ఐజి త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ ఆరిఫ్ హుటాహుటిన రెండు ప్రాంతాలకు వెళ్లి మర్డర్ జరిగిన తీరును పరిశీలించారు. దోపిడిదొంగల పనిగా అనుమానిస్తున్నారు. సీసీకెమెరాల సాయంతో హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్పాట్‌లో లభించిన ఆధారాలను స్వాధానం చేసుకున్నారు. నిందితుల కోసం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. మర్డర్ జరిగిన తీరును బట్టి అంతరాష్ట్ర దొంగల ముఠా పనా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com