Crime: తాడేపల్లిలో అమానుషం.. అంధబాలిక హత్య

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 17ఏళ్ల అంధబాలికపై ఓ కిరాతకుడు సోమవారం కత్తితో దాడిచేశాడు. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఈ అమానుష ఘటన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంటికి చేరువలో జరిగింది. వివరాల్లోకి వెళితే రాజు అనే యువకుడు ఆదివారం సదరు అందబాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన విషయం ఆ బాలిక తల్లితండ్రులకు చెప్పింది. దీంతో వారు కొందరు స్థానికులతో కలసి రాజును నిలదీశారు.
దానిపై కోపోద్రీక్తుడైన రాజు పగ తీర్చుకోవడం కోసం పథకం పన్నాడు. సోమవారం బాలిక వంటరిగా ఇంట్లో ఉండటాన్ని గమనించాడు. ఇంట్లోకి దూరి కత్తితో ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయాడు. బాదితురాలి ఏడ్పులు విన్న ఇరుగు పొరుగు వారు ఇంట్లోకి వెళ్లారు. రక్తపుగాయలతో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూసింది.
అక్కడి నుంచి పారిపోయిన రాజు పోలీసుల ముందు లొంగిపోయాడు. అతనిపై ఇంతకు ముందే క్రిమినల్ రికార్డ్ ఉంది. అదే కాక ఈ దాడికి పాల్పడ్డ సమయంలో రాజు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడైన రాజుకు కఠిన శిక్ష విధించాలని బాదితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు. అలాగే ఆ ప్రాంతంలో జరిగే అసాంఘీక కార్యకలాపాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com