Ramesh Hospital : రమేష్ ఆసుపత్రి పై క్రిమినల్ కేసులున్నాయి : ఏఏజీ

Ramesh Hospital :  రమేష్ ఆసుపత్రి పై క్రిమినల్ కేసులున్నాయి : ఏఏజీ
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును రమేశ్ ఆస్పత్రికి తరలించాలన్న హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం చెప్పారు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును రమేశ్ ఆస్పత్రికి తరలించాలన్న హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం చెప్పారు. రమేష్ ఆసుపత్రిలో క్రిమినల్ కేసులున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ప్రభుత్వ న్యాయవాది. రమేశ్ ఆస్పత్రికి పంపడమంటే టీడీపీ ఆఫీసుకు పంపినట్లేనని, రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో 10 మంది చనిపోయారని, ఆ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. దీనిపై ఆధారాలతో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు AAGని కోరింది. అటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్య బృందం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. వైద్య నిపుణులు ఇచ్చిన రిపోర్టును న్యాయమూర్తులు చదివి వినిపించగా.. ఎంపీ రఘుకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినట్లు వైద్య బృందం కోర్టుకు తెలిపింది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని రిపోర్టులో వైద్య బృందం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story