Andhra Pradesh : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..!

కరోనా కేసులు ఉద్ధృతి దృష్ట్యా ఏపీలో కర్ఫ్యూని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులే అయిందన్న సీఎం జగన్ .. కర్ఫ్యూ 4 వారాలు ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయని వెల్లడించారు. అటు రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలే నెలాఖరు వరకు కొనసాగుతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు.
ఈ నెల 5న అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ.. 18వ తేదీ వరకు ఉంటుందని ప్రభుత్వం నాలుగో తేదీన వెల్లడించింది. అయినప్పటికీ కేసులు తగ్గకపోవడంతో పగటి కర్ఫ్యూని పొడిగించారు. ప్రస్తుతం రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటున్నాయి. ఆ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com