మంత్రికి కరెన్సీ నోట్లతో స్వాగతం.. ఊరేగింపులో మార్కెట్ కమిటీ చైర్మన్ హల్‌చల్‌..!

మంత్రికి కరెన్సీ నోట్లతో స్వాగతం.. ఊరేగింపులో మార్కెట్ కమిటీ చైర్మన్ హల్‌చల్‌..!
అసలే ఊరేగింపు. పైగా ఆయన మంత్రిగారి అనుచరుడు. ఇంకేముంది. స్వాగతం చెప్తూ ఏర్పాటు చేసిన ర్యాలీలో నోట్లు వెదచల్లుతూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

అసలే ఊరేగింపు. పైగా ఆయన మంత్రిగారి అనుచరుడు. ఇంకేముంది. స్వాగతం చెప్తూ ఏర్పాటు చేసిన ర్యాలీలో నోట్లు వెదచల్లుతూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కోనసీమ జిల్లా అమలాపురం MLA పినిపే విశ్వరూప్‌ రెండోసారి మంత్రి అయ్యారు. ఈసారి రవాణామంత్రిగా బాధ్యతలు చేపట్టి సొంతూరికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీకి ప్లాన్‌ చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ కొండలరావు తన ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. ర్యాలీలో ర్యాలీ పొడవునా నోట్లు వెదచల్లుతూ హల్‌చల్‌ చేశారు. ఇదంతా మంత్రిగారిపై అభిమానంతోనే చేశానంటూ ఆయన చెప్పుకుంటున్నా.. ఏపీలో కొత్త కల్చర్‌ తెచ్చారంటూ సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అభిమాన నేతకు స్వాగతం పలకాలంటే దద్దరిల్లిపోయే DJ పెట్టడం చూశం. బైక్‌ర్యాలీలో, కార్ల ర్యాలీలో పెట్టడం చూశాం. గజ మాలలతో సత్కారాలు చూశాం.. కానీ ఇలా నోట్లు చల్లుతూ హంగామా చేయడం చర్చనీయాంశమైంది. విశ్వరూప్‌పై ఎంత అభిమానం ఉంటే మాత్రం నోట్లను ఇలా రోడ్లపై చల్లుతారా..? అంటూ స్థానికులే ప్రశ్నిస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాననే వ్యక్తిలో ఇంత బలుపేంటనే మాటా వినిపించింది.

ఇకపై మంత్రి పేరు చెప్పి చెలరేగిపోవచ్చనే అహంకారమే కొండలరావు ఇలా చేయడానికి కారణమా..? లేదంటే.. అందరి దృష్టిలో పడడానికే ఈ చీప్‌ స్టంట్‌ను ఎంచుకున్నారా అనే దానిపై ఎవరి వాదన వాళ్లు చెప్తున్నారు. ఎప్పుడూ ఒంటినిండా బంగారు చైన్లు ఉంగరాలతో కనిపించే కొండల్‌రావు ఇప్పుడిలా నోట్లు చల్లి వార్తల్లోకి రావడం విశేషం. అసలు ఇలా నోట్లు చల్లడం ద్వారా ఆయన పబ్లిక్‌కి ఏం మేసేజ్‌ ఇద్దామనుకున్నారు అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ర్యాలీ మొదలవగానే కొండల్‌రావు జేబులో ఉన్న డబ్బు అక్కడ నిలబడనంటూ తన్నుకొచ్చి రోడ్లపై పడడంతో జనం వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు.

తాను అనుకున్నది ఒకటైతే రివర్స్‌లో ఇంకోటి జరుగుతూ ఇమేజ్‌ డ్యామేజ్ అవుతుందని అనుకున్నారో ఏమో.. కొండల్‌రావు ఇప్పుడు చల్లబడ్డారు. మంత్రిగారిపై అభిమానం చూపించాలనే ఉద్దేశమే తప్ప డబ్బు ఎక్కువయ్యో, ఇంకోటో కారణం కాదంటూ చెప్పుకొచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేపట్టి తాను మారిపోయానని కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story