AP Government : రైతులే టార్గెట్.. ఇక వ్యవసాయ మోటార్లకు కరెంట్ మీటర్లు

AP Government : ఇప్పటికే అన్న వర్గాలను టార్గెట్ చేసిన జగన్ సర్కారు... ఇప్పుడు రైతుల్ని టార్గెట్ చేసింది. విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగించేందుకు రెడీ అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించాలని నిర్ణయించింది.ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ సమీక్షలో....మోటర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్... శ్రీకాకాళం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని, దాదాపు 30 శాతం విద్యుత్ ఆదా అయిందన్నారు సీఎం జగన్. కనెక్షన్లు పెరిగినప్పటికీ దాదాపు 34 మిలియన్ల యూనిట్ల కరెంట్ ఆదా అయిందన్నారు.
అయితే... రాజకీయ లబ్ధి కోసమే మీటర్లు ఏర్పాటు వ్యవహారంలో విపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయంటూ విమర్శలు చేశారు సీఎం జగన్. దీన్ని తిప్పికొట్టి రైతులకు జరుగతున్న మేలును వివరించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com