Sunil Kumar : నిజాలు దాచేస్తున్న సునీల్ కుమార్..!

Sunil Kumar : నిజాలు దాచేస్తున్న సునీల్ కుమార్..!
X

వైసీపీ హయాంలో జగన్ చెప్పినట్టు చేసి చాలామంది ఐపీఎస్ అధికారులు రెచ్చిపోయారు. జగన్ ఇచ్చే డబ్బుల కోసం రాజ్యాంగాన్ని, రూల్స్ ను తుంగలో తొక్కి ప్రతిపక్షాలను వేధించారు. అప్పటి ఎంపీ, ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ1 గా ఉన్న సస్పెండెడ్ ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్ నిన్న విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో రఘురామకృష్ణం రాజును టార్చర్ చేసిన వ్యక్తిగా సునీల్ కుమార్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన నిన్న విచారణలో చాలా విషయాలు దాటేసినట్టు తెలుస్తోంది. రఘురామకృష్ణం రాజును ఎవరు కొట్టమన్నారు, ఎందుకు కస్టోడియల్ టార్చర్ చేశారు, ఎవరు చెబితే చేశారు, ఎవరైనా పైనుంచి ఆర్డర్ చేశారా అదే ప్రశ్నలు నిన్న అధికారులు వేస్తే వాటన్నింటినీ దాటవేశారు సునీల్ కుమార్. పొంతన లేని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తనను టార్చర్ చేశారు అని రఘురామకృష్ణంరాజు అప్పట్లో కోర్టుల దాకా వెళ్ళినా సరే జగన్ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు.

కావాలని సునీల్ కుమార్ ను కాపాడుకుంటూ వచ్చింది వైసిపి ప్రభుత్వం. సునీల్ కుమార్ మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా సరే కనీసం స్పందించలేదు అప్పటి సీఎం జగన్. ఎందుకంటే సునీల్ కుమార్ ఉన్నదే జగన్ కళ్ళలో ఆనందం చూడటానికి. జగన్ ఏది చెబితే దాన్ని చేసేయడమే సునీల్ కుమార్ పని. వైసిపి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని కక్షతో రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్ చేయించారు అని ఆరోపణలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆ టార్చర్ లో రఘురామ ఒంటిమీద ఎన్నో గాయాలు అయినా సరే గుంటూరు జిజిహెచ్ నుంచి మెడికల్ రిపోర్టు తారుమారు చేయించారు సునీల్ కుమార్. రఘురామ ఒంటిమీద ఒక్క గాయం కూడా లేదని సర్టిఫికెట్ తీసుకొచ్చారు. అప్పటి గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ కూడా ఈ కేసులో నిందితురాలీగా ఉన్నారు. ఈ కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే.

సునీల్ కుమార్ నోరు విప్పితే ఈ కేసులో ఎవరు ఆర్డర్ చేస్తే టార్చర్ చేశారు అనేది తేలిపోయేది. కానీ సునీల్ కుమార్ వాటన్నింటినీ బయట పెట్టట్లేదు. కావాలనే దాచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసులో ఎలాగైనా కీలక విషయాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అసలు విషయాలను బయటకు రాబట్టి కేసులో నిజాలను ప్రజలకు తెలియజేయాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ అండతో రెచ్చిపోయిన ఐపీఎస్ అధికారులకు ఇప్పటికే చాలా శిక్షలు పడుతున్నాయి. కాబట్టి ఐపిఎస్ అధికారులు ప్రజలను కాపాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి తప్ప ఇలా పొలిటికల్ బాస్ ల కోసం పని చేస్తే ఇలాంటి కేసులు శిక్షలు తప్పవు.


Tags

Next Story