Cyclone Asani: ఏపీకి దగ్గరగా అసాని తుఫాన్.. ఆ జిల్లాలకు మరోసారి హెచ్చరికలు..

Cyclone Asani: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసాని తుపాన్ దూసుకొస్తోంది. ఇది తీవ్ర తుపానుగా మారి.. రేపటికి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరానికి దగ్గర వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తర్వాత ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్య్సకారులు సముద్రంపై వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం అసని తుపాన్.. విశాఖకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావారణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు తుపాన్ హెచ్చరికలు పంపింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది.
బంగాళాఖాతం మధ్యలో ప్రస్తుతానికి 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా.. తుపాను తీరానికి వస్తున్న కొద్దీ తీవ్రత తగ్గొచ్చని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది. ఆ సమయానికి గంటకు 60 కిలో మీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయని తెలిపింది. తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ వల్ల మూడు రోజుల పాటు సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com