Chandrababu Naidu : మొంథా తుఫాన్.. ఆన్ డ్యూటీలో చంద్రబాబు

ప్రకృతి విపత్తులు వస్తే ఆపడం ఎవరి తరం కాదు. కానీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కుని ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా చూడాలంటే ప్రభుత్వం, అధికారులు ముందస్తుగా అలెర్ట్ గా ఉండాలి. ఎలాంటి ప్రమాదాన్ని అయినా ఎదుర్కుని ప్రజలను కాపాడుకోవాలి. ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ స్థాయిలోనే అలెర్ట్ గా ఉంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే దుబాయ్ పర్యటన నుంచి ఏపీకి వచ్చేశారు. వచ్చీ రాగానే అధికారులను అలెర్ట్ చేశారు. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం ఎంత ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఏ జిల్లాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పంట నష్టం అంచనాలు, విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
మంత్రులు, అధికారులతో వరుస మీటింగులు పెడుతున్నారు. కూటమి నేతలంతా క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్య ఉండాలన్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గుంటూరు, కృష్ణ, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులను రెడీ చేయించారు. ఇక్కడకు ఇప్పటికే చాలా కుటుంబాలను తరలించారు. ఇక్కడ ఉండే కుటుంబాలకు రూ.3వేల నగదు, 25 కేజీల బియ్యం అందించారు. ఇతర ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. చెరువు కట్టలు, కాలువలు తెగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిని రిపేర్ చేయడానికి సరిపోయే బస్తాలను కూడీ రెడీ చేయాలన్నారు.
ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని కోరారు. 3 వేల స్థంబాలను రెడీ చేయించారు. కరెంట్ పోల్స్ విరిగిపోతే వెంటనే అమర్చాలన్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు112, 1070 18004250101 ను ఏర్పాటు చేయించారు సీఎం చంద్రబాబు. ఎక్కడ ఏ ఒక్కరికి కష్టం వచ్చినా సరే వెంటనే స్పందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇవ్వొద్దన్నారు. అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వెంటనే రెస్పాన్స్ కావాలన్నారు చంద్రబాబు. ఆరోగ్య సిబ్బంది, విద్యుత్ శాఖ, విపత్తు శాఖకు అలెర్ట్ గా ఉండాలన్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కున్న సమర్థమైన నాయకుడిగా సీఎం చంద్రబాబుకు పేరుంది. గతంలో హుద్ హుద్ తుఫాన్ నష్టాన్ని ఎలా పూడ్చారో మనం చూశాం. మొన్నటి వరదల్లోనూ ఆయన అన్ని ఏరియాలు తిరుగుతూ సౌకర్యాలు కల్పించారు. బాధితులకు అండగా ఉంటూ వారికి అన్ని వసతులు కల్పిస్తారనే పేరుంది. ఇప్పుడు ఈ మొంథా తుఫాన్ ను ఎదుర్కోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

