Heavy Rain Alert : తీరం దాటిన వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..

X
By - Manikanta |27 Sept 2025 11:02 AM IST
కుండపోత వర్షాలతో సతమతమవుతోన్న తెలుగు రాష్ట్రాలకు కొంత ఊరట లభించింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఎట్టకేలకు దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. ఇది ప్రస్తుతం పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడనుంది.
ఈ వాయుగుండం తీరం దాటడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త ఉపశమనం పొందినప్పటికీ, మరో 24 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.అలాగే, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర లో కూడా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో వరదల ప్రవాహం ఎక్కువగా ఉందనుందని...ముఖ్యముగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com