Train Service : తిరుపతి - షిరిడీ మధ్య ఇకపై ప్రతిరోజూ రైలు సర్వీస్...

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిరిడీ మధ్య ఇకపై ప్రతిరోజూ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడుస్తున్న సర్వీసును ఇకపై శాశ్వత రైలుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో రైలు నెంబర్ 07637/07638 సర్వీస్ ఇకపై తిరుపతి నుంచి షిరిడీకి ప్రతిరోజూ అందుబాటులో ఉండనుంది. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. దీంతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణం ఇక సులభతరం కానుంది. సీఎం చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యం అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com