Kadapa Floods: వరద బీభత్సం.. బయటపడుతున్న శవాలు

X
By - Prasanna |20 Nov 2021 11:15 AM IST
Kadapa Floods: పలు గ్రామాల్లో వరదలో గల్లంతైన వారి మృతదేహాలు బయపడుతున్నాయి.
Kadapa Floods: కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వరద సృష్టించిన బీభత్సం ఎలా ఉందన్న దృశ్యాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. చెట్టుపుట్టలు తట్టుకుని నిలిచిపోయిన శవాలు, ఎక్కడికక్కడ పడి ఉన్న మూగజీవాల కళేబరాలతో భీతావహ వాతావరణం నెలకొంది.
రాజంపేట, నందలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో వరదలో గల్లంతైన వారి మృతదేహాలు బయపడుతున్నాయి. మందరం, శేషారెడ్డి పల్లె, నందలూరు, నీలిపల్లి, గండ్లూరు గ్రామాల్లో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. వరదలో గల్లంతైన వారు శవాలుగా కనిపిస్తుండడంతో కుటుంబసభ్యులు రోధిస్తున్నారు.
ఇక ఎన్ని మూగజీవాలు చనిపోయానన్న దానిపై లెక్కే లేదు. అధికారిక లెక్కలపై జిల్లా యంత్రాంగం ఇప్పటికీ నోరుమెదపకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com