Liquor Tender : కాసేపట్లో మద్యం టెండర్లకు ముగియనున్న గడువు

నేటితో ఏపీలో మద్యం దరఖాస్తుల గడువు ముగియనుంది. కాగా ఇవాళ భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఇవాళ సాయంత్రం 7 గంటల వరకు గడువు పొడిగించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఏఈఎస్ వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం 65వేల 424 దరఖాస్తులు అందాయని తెలిపారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4వేల 839 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో ఏలూరు జిల్లాలో 4వేల 260 దరఖాస్తులు..అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 869 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు అధికారులు
అద్దంకి సర్కిల్ పరిధిలోని 23 షాపులకు 267 దరఖాస్తులు అందాయన్నారు. మండలాలవారీగా అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో 5 షాపులకు 63, రూరల్ మండల పరిధిలో 2 ఇంటికి 13, బల్లికురవ మండలంలో 4 ఇంటికి 37, కొరిశపాడు మండలంలో 4 ఇంటికి 62, పంగులూరు మండలంలో 3కుగాను 56, సంతమాగులూరు మండలంలో 5 దుకాణాలకు 36 దరఖాస్తులు అందాయని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వ చ్చే అవకాశం ఉందన్నారు. ఉత్సాహవంతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సీఐ భవాని ఉన్నారు.
మద్యం షాపుల టెండర్లకు సంబంధించిన దరఖాసు గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో వ్యాపారులు పోటీపడుతుండడంతో ప్రక్రియ ఊపందుకుందుకుంది. పర్చూరు ఎక్సైజ్ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 15 దుకాణాలకు టెండర్ ప్రక్రియ ఉండగా, ఇప్పటికే 366 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకొల్లు, మార్టూరు మండలాల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇంకొల్లు మండలంలో మొత్తం మూడు దుకాణాలకు 121 దరఖాస్తులు, మార్టూరు మండలానికి సంబంధించి మొత్తం 6 ఇంటికి గాను 167, పర్చూరు మండలానికి 63, యద్దనపూడి మండలానికి 15 చొప్పున దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. మద్యం దుకాణాలకు కలెక్టర్‌ల ఆధ్వర్యంలో ఈనెల 14న డ్రా తీయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com