Jana Sena MLA : అప్పుల పాలయ్యా.. కారు తీసుకెళ్లారు.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

దేశంలో రాజకీయాలు అంటే చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఒకసారి ఎమ్మెల్యే, ఎంపీ అయ్యారంటే చాలు ఇక లైఫ్ సెట్టు అయినట్టే అని భావిస్తుంటారు చాలా మంది. ప్రభుత్వం ఇచ్చే అలవెన్సులు, పర్సనల్ సెక్యూరిటీ, కార్లు...ఇక అనధికారిక మామూళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందుకే మన దగ్గర పేద పొలిటీషియన్ నీ ఎవ్వరూ చూసి ఉండరు. దీపం ఉన్నపుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని నేతలు కూడా పదవిలో ఉన్నప్పుడే కాసిన్ని కాసులు వెనకేసుకుంటారు. ఉండేది 5 ఏండ్లు కాబట్టి ఉన్నప్పుడే సంపాదించుకుంటే ఫ్యూచర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తుంటారు.
కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో లో మాట్లాడిన ఆయన తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. ఒకప్పుడు గొప్పగా బతికిన తమ కుటుంబం ఇప్పుడు పేదరికం లో మగ్గుతోందని అందరికీ షాక్ ఇచ్చారు. రాజకీయాల కారణంగా అప్పులపాలైపోయానని కామెంట్ చేశారు.కిస్తీ కట్టక పోవడం తో తన కారును ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారని ప్రస్తతం అల్లుడి కారును వాడుతున్నానని పేర్కొన్నారు. ఏది ఏమైనా నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని, నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడి పని చేస్తానని చెప్పుకొచ్చారు బత్తుల బలరామకృష్ణ. ఇక ఆయన మాటలు విన్న పలువురు.. ఈ కాలంలో ఇలాంటి రాజకీయ నేతలు కూడా ఉన్నారా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com