Sakshi : సాక్షి మీడియాకు భారీ షాక్.. జగన్ ఇప్పుడేమంటారో..?

తిరుమల కల్తీ నెయ్యి కేసు వైసీపీ నేతల మెడకు చుట్టుకుంటున్న తరుణంలో సాక్ష మీడియా అడ్డగోలు తప్పుడు ప్రచారాలకు తెర లేపింది. ఎలాగోలా సీఎం చంద్రబాబు నాయుడికి మచ్చ తీసుకురావడానికి ఏకంగా ఇందాపూర్ డెయిరీని వాడుకుంటోంది. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయని.. అందుకే ఆ డెయిరీకి ఎక్కువ ధరలకు నెయ్యి టెండర్లు కట్టబెట్టారంటూ వైసీపీకి చెందిన సాక్షి మీడియా కట్టు కథనాలు రాసింది. దీనిపై హెరిటేజ్ ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసు వేసింది. ఢిల్లీ హైకోర్టు హెరిటేజ్ మీద రాసిన కథనాలను వెంటనే డిలీట్ చేయాలంటూ సాక్షి మీడియాకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో దెబ్బకు సాక్షి మీడియా తోక ముడిచింది. నిన్న మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇందాపూర్ కు, హెరిటేజ్ కు సంబంధాలు ఉన్నాయంటూ ఫేక్ కామెంట్స్ చేశారు.
కానీ సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయాన్ని మాత్రం ఆయన పక్కన పెట్టేశారు. ఇది ఎంత దారుణం అసలు. అసలు నిజాలను ప్రజలకు వివరించకుండా.. కేవలం చీజ్ ను కొన్నందుకు ఇందాపూర్ కు, హెరిటేజ్ కు సంబంధాలు ఉన్నాయంటూ కట్టు కథనాలు రాయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఇప్పుడు కూటమి నేతల ప్రశ్నలు. కానీ వీటికి సాక్షి నుంచి గానీ.. జగన్ నుంచి గానీ ఎలాంటి సమాధానాలు రాలేదు.
ఇప్పుడు యావత్ కూటమి కార్యకర్తలు అందరూ జగన్ ను ఇదే ప్రశ్నిస్తున్నారు. హెరిటేజ్ వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసుపై జగన్ ఎందుకు మాట్లాడట్లేదు అని. కానీ జగన్ దాని గురించి మాట్లాడితే తన పరువు పోతుందనే ఉద్దేశంతోనే సైలెంట్ గా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు జనాలు.
Tags
- Tirumala ghee adulteration case
- YSRCP
- Sakshi media controversy
- Heritage Foods defamation case
- Delhi High Court notice
- Indapur Dairy issue
- Chandrababu Naidu
- YS Jagan Mohan Reddy
- TTD tender controversy
- Andhra Pradesh politics
- ₹100 crore defamation suit
- political allegations
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
