AP Deputy CM : బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్ ని స్వయంగా నడిపారు. అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు. ఆ సైకిల్ పై సిద్ధూని కూర్చోబెట్టుకొని నడిపారు. విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com