ముఖ్యమంత్రికి దమ్ముంటే ఆస్పత్రులను సందర్శించాలి : దేవినేని ఉమ

ముఖ్యమంత్రికి దమ్ముంటే ఆస్పత్రులను సందర్శించాలి : దేవినేని ఉమ
ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే.. ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే.. ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. విచారణలో భాగంగా మంగళగిరి సీఐడీ కార్యాలయానికి వచ్చిన ఆయన... కోవిడ్ చర్యలపై ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో సేద తీరుతున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి .. తన గొంతు నొక్కలేరన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ అస్థవ్యస్థంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story