DGP Dwaraka : పవన్ వ్యాఖ్యలపై కామెంట్ చేయను : డీజీపీ ద్వారక

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ వ్యాఖ్యలపై తాను కామెంట్ చేయనని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో తాము పనిచేయమని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని, ఏ కేసునైనా వాస్తవ పరిస్థితుల ఆధారంగానే విచారిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సోమవారం ఉదయం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు.. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. మమ్మల్ని విమర్శించే నాయకులందరికీ నేను ఈ రోజు చెబుతున్నా. ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండి. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది.. గుర్తుపెట్టుకోండి.’ అని పవన్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com