Dimili Festival: విశాఖ జిల్లాలో వింత పండుగ.. కాలువలో దిగి.. బురద రాసుకొని..

Dimili Festival (tv5news.in)
Dimili Festival: విశాఖ జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామం వింత పండగలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. వింతపండగలకు పెట్టిందిపేరయిన దిమిలిలో వారం వ్యవధిలో రెండు పండగలు జరుపుకోవటం విశేషం. తొలుత వెదుర్ల పండగను ఘనంగా నిర్వహించిన స్థానికులు తాజాగా బురద పండగ జరుపుకుంటున్న తీరు అందర్ని ఆశ్చపరుస్తోంది.
కుళ్లు కాలువలోని మురికిని కేరింతల నడుమ ఒకరినొకరు ఒంటినిండా రాసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న తీరును చూసి..చూపరులకు ఔరా అనిపిస్తోంది. దామిలిలో రెండేళ్ల కొకమారు జరుపుకునే ఈ వింతపండగలకు.. చారిత్రాత్మక నేపథ్యం ఉండటం మరో విశేషం. పూర్వ కాలంలో గజదొంగల దండు ఊరిపై దండెత్తి ధన, ధాన్యాలతోపాటు మహిళలను అపహరించి తీసుకెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు.
దోపిడి దొంగల దండు నుంచి స్థానికులను కాపాడేందుకు.. దల్లమ్మ అనే మహిళ చూపిన తెగువ అందర్ని ఆశ్చర్యపర్చినట్లు చెబుతున్నారు. ఆమె ఇచ్చిన ధైర్యంతో బందిపోట్లను తరిమికొట్టినట్లు స్థానికులు వివరించారు. ఈ క్రమంలో దల్లమ్మ ఓ బురద గంటలోపడి మృతిచెందినట్లు కథనాలున్నాయి. వీర మహిళ దల్లమ్మకు నివాళులర్పించేందుకే ఈ వింత పండగను జరుపుకుటున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com