RGV : కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వర్మ..!

RGV :  కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వర్మ..!
RGV : ఏపీలో హాట్ టాఫిక్ గా మారిన గుడివాడ క్యాసినోపై ప్రముఖ RGV దృష్టి సారించారు.

RGV : ఏపీలో హాట్ టాఫిక్ గా మారిన గుడివాడ క్యాసినోపై ప్రముఖ RGV దృష్టి సారించారు. సినిమా టికెట్ల వివాదంపై నిన్నామొన్నటివరకు ట్విట్స్ రచ్చ నడిపిన RGV .... గుడివాడ క్యాసినోపై, మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడకు గోవా కల్చర్ తెచ్చారంటూ మంత్రిని అంతా తప్పు పడుతున్నారని....కానీ తన సపోర్టు మాత్రం కొడాలికేనన్నారు. గుడివాడను గోవాలానే కాదు........ లాస్ వెగాస్, లండన్, ప్యారిస్ ల సరసన చేర్చినందుకు కొడాలినానిని అంతా అభినందించాలంటూ ట్వీట్ చేశారు. ఎపుడూ ఏదీ తిన్నగా చెప్పని RGV.... గుడివాడ క్యాసినో, మంత్రి కొడాలినానిపై వ్యంగ్య పొగడ్తల సారాశం హాట్ టాఫిక్ అయింది. మొన్నటి వరకు హీరో నాని తప్ప తనకే నాని తెలియదంటూ చెప్పుకొచ్చిన RGV సడెన్‌గా కొడాలి నానిని ఆకాశానికెత్తడంపైనా ట్విట్టర్లో ట్రోల్స్ నడుస్తున్నాయి.

గుడివాడ క్యాసినోపై RGV ట్వీట్లకు నెటిజన్ల నుంచి ఆసక్తికర సమాధానాలొస్తున్నాయి. పోలీసులు RGV ట్విట్టర్ స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకుని మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణ పేరుతో టైం వేస్ట్ చేయొద్దంటూ పోలీసులకు సూచిస్తున్నారు. వైసీపీ పార్టీ రంగులతో డెకరేట్ చేసి.. కొడాలి నానిమీద పాట కూడా రాసి డాన్సులేశారని... అలాంటి నానిని ఎలా వెనుకేసుకొస్తున్నావంటూ ఇంకొందరు RGVని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. గుడివాడ క్యాసినోలో ఎంట్రీ ఫీజు 10వేలు పెట్టారని... సినిమా టికెట్లలాగే తమకు క్యాసినో రేట్లు అందుబాటులో ఉంచాలంటూ నిలదీశారు.

ఇక ఇప్పటికే గుడివాడ క్యాసినో టాక్‌ ఆఫ్‌ ది స్టేట్ అయ్యింది. గోవా, శ్రీలంకల్ని మించిన స్థాయిలో సంక్రాంతికి గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారు. మందు నుంచి మగువ వరకు.. రమ్మీ నుంచి మూడు ముక్కల వరకు.. జూదంలో ఎన్ని రకాలున్నాయో అన్నింటినీ కళ్లముందుకు తెచ్చి పండగ చేస్కోమన్నారనే ప్రచారం జరుగుతోంది. 500కోట్ల మేర పందేలు జరిగాయంటేనే ఏ స్థాయిలో ఏర్పాట్లు చేసి, ఎంత మందికి ఆహ్వానాలు పంపారో అర్థం చేసుకోవచ్చు. చూడ్డానికి సంక్రాంతి సంబరాలే అనేట్టుగా బయట కలరింగ్‌ ఇచ్చినా.. లోపలకు వెళ్లి చూస్తే వైసీపీ రంగుల్ని పోలిన గుడారాల్లో ఎంత అరాచకం జరగాలో అంతా జరిగిందనే మాట స్థానికంగా చాలా బలంగా వినిపించింది. ఎవరూ వీడియోలు చిత్రీకరించకుండా బౌన్సర్లను కూడా పెట్టినా కొందరు చాటుగా షూట్‌ చేయడంతో ఈ తతంగమంతా బయటకు వచ్చింది.

చాలా మందికి ఈ తరహా గేమ్స్‌ చూసిన, ఆడిన అనుభవం లేకపోవడంతో వారికి వీటి గురించి వివరించి చెప్పి మరీ జూదం ఆడించారు. గోవా, శ్రీలంక క్యాసినోలను మించి ఇక్కడ దోపిడీ జరిగిందని ఘొల్లుమనడం తప్ప ఎవరూ బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. ఎంట్రీ ఫీజు 10వేలు, డిపాజిట్‌ 10 లక్షలు ఇలా అన్నీ ఫిక్స్‌ చేసి.. జూదగాళ్లకు సకల సౌకర్యాలు కల్పించి అడ్డంగా దోచేసుకున్నారంటున్నారు. గుడివాడలో గోవా కల్చర్‌పై విపక్షాలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని వైపుల నుంచి గుడివాడ క్యాసినోపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కృష్ణా పోలీసులు కదిలారు. క్యాసినో వ్యవహారంపై విచారణకు ఆదేశించారు ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌. ఇందుకోసం ప్రత్యేక విచారణ అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును నియమించారు. సంక్రాంతి 4 రోజులు ఏం జరిగింది అనే దానిపై ఇప్పటికే గుడివాడ డీఎస్పీతో మాట్లాడిన ఎస్పీ.. ఇప్పుడు విచారణ బాధ్యతలు నూజివీడు డీఎస్పీకి అప్పగించారు.గోవా నుంచి క్యాసీనో టీమ్‌ను రప్పించింది ఎవరనే దానిపై దర్యాప్తు జరగనుంది.

గుడివాడలో క్యాసినో పెట్టి రచ్చ రచ్చ చేసిన బ్యాచ్ ఎవరు..? వీళ్ల వెనకుండి అంతా నడిపించింది ఎవరు..? గోవా నుంచి క్యాసినో బ్యాచ్‌ను ఇక్కడకు తీసుకు వచ్చింది ఎవరు..? విచారణకు ఎస్పీ ఆదేశించడంతో వాస్తవాలు ఇప్పటికైనా బయటకు వస్తాయా..? నెక్స్ట్‌ ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story