RGV : ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ ట్వీట్ల వర్షం

RGV :  ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ ట్వీట్ల వర్షం
RGV : పేర్ని నానితో సమావేశం తర్వాత ఒక్క రోజు బ్రేక్‌ ఇచ్చిన ఆర్జీవీ.. ఇప్పుడు మళ్లీ విరుచుకుపడ్డారు.

RGV : పేర్ని నానితో సమావేశం తర్వాత ఒక్క రోజు బ్రేక్‌ ఇచ్చిన ఆర్జీవీ.. ఇప్పుడు మళ్లీ విరుచుకుపడ్డారు. పేర్ని నానితో చర్చలతో పెద్దగా సానుకూల ప్రకటనలు ఏమీ రాకపోవడంతో.. మళ్లీ ఆయన ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. తన లాజికల్‌ క్వశ్చన్స్‌తో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ముందు టికెట్ల ధరలనే పట్టుకున్న వర్మ.. 2,200 రూపాయలకు రాజమౌళి ట్రిపుల్‌ ఆర్‌ సినిమా టికెట్లను అమ్ముకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్‌, చిన్నచిన్న మల్టీప్లెక్స్‌ల్లో కూడా 2,200 రూపాయలకు టికెట్‌లను విక్రయిస్తున్నారు. మరీ సొంత రాష్ట్రం ఏపీలో కనీసం 200 రూపాయలకు కూడా అనుమతించరా.? అంటూ ట్వీట్‌ చేశారు.

సినిమా షోల సంఖ్యపై పరిమితి పెట్టడం పైనా వర్మ ప్రశ్నల వర్షం కురిపించారు. పగలు, రాత్రి ఎక్కువ షోలు ప్రదర్శించడం వల్ల ఏం హాని జరుగుతుంది.? కోవిడ్‌ కంటే ముందు మహారాష్ట్రలో 24గంటల షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదా.? అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు షోలకు టైమ్‌ ఫిక్స్‌ చేయడం ఏంటన్నారు వర్మ. ప్రజలు వారి అనుకూల సమయంలో వచ్చి సినిమాలు చూసుకుంటారు. వర్క్‌లో కూడా అందరికి షిఫ్ట్‌లు ఉన్నాయి. వారు.. వారివారి షిఫ్ట్‌లకు అనుగుణంగా సినిమా చూసుకునే అవకాశాన్ని ఎందుకు లాగేస్తున్నారు.? అర్థరాత్రి తర్వాత అయితే ఏంటి.. వారి అనుకూల సమయంలో వారిని సినిమా చూడనివ్వరా.? అంటూ వరుస ట్వీట్‌లు చేశారు.

టికెట్ల ధరలపై నియంత్రణ, స్టార్ల రెమ్యూనరేషన్లపై ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలకు వర్మ తన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. ఒక వేళ బెనిఫిట్‌ షోలు వేసి ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మితే.. దాన్ని కొనడానికి ప్రజలు కూడా సిద్ధపడితే.. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంటుంది.? దాని వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది కదా.? అంటూ ప్రశ్నించారు. తయారు చేసేవాడిని నువ్వు ఇంత రేటుకే అమ్మాలి అంటే.. వాడు తయారు చేయడం మానేస్తాడు.. లేదా తక్కువ క్వాలిటీ వస్తువులను తయారు చేస్తాడు అంటూ.. ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ ట్విట్ల వర్షం కురిపించారు. స్టార్‌ హీరోలకు అంతంత రెమ్యునరేషనా అంటున్నారు.. ఇంత నాకు ఇవ్వాల్సిందే అని స్టార్స్‌.. ప్రోడ్యూసర్స్‌ని బెదిరిస్తున్నారా.? అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story