తిరుమలలో ఇవాళ్టి నుంచి సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తున్నాం : వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో ఇవాళ్టి నుంచి సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తున్నాం : వైవీ సుబ్బారెడ్డి
సేంద్రియ సాగులో పండించిన ధాన్యంతో ఆహారం తయారు చేసే ఈ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు... టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

తిరుమలలో వినూత్నంగా ప్రవేశపెట్టిన సంప్రదాయ భోజనంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సేంద్రియ సాగులో పండించిన ధాన్యంతో ఆహారం తయారు చేసే ఈ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు... టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పాలకమండలి లేని సమయంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీని ఉద్దేశం మంచిదే అయినా... తిరుమలలో ఏ ఆహారాన్నైనా స్వామివారి ప్రసాదంగానే అందించాలన్న ఉద్దేశంతోనే.. కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకంపై సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. వాటిని భక్తులు ఏ మాత్రం నమ్మవద్దని... టీటీడీ ఛైర్మన్‌ కోరారు. అలాగే కృష్ణాష్టమి సందర్భంగా తిరుమలలో నవనీత సేవ పేరుతో కొత్త సేవకు శ్రీకారం చుట్టినట్లు... వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story