ముసి ముసి నవ్వులు నవ్వితే మోసపోవద్దు జగన్‌ సార్‌

ముసి ముసి నవ్వులు నవ్వితే మోసపోవద్దు జగన్‌ సార్‌
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీలో అసమ్మతి రాజుకుంది. మంత్రి ఉషశ్రీ చరణ్‌కి వ్యతిరేకంగా వైసీపీ అసమ్మతి నేతలు సమావేశమ్యారు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీలో అసమ్మతి రాజుకుంది. మంత్రి ఉషశ్రీ చరణ్‌కి వ్యతిరేకంగా వైసీపీ అసమ్మతి నేతలు సమావేశమ్యారు. సీనియర్‌నేత, నియోజకవర్గ వైసీపీ మాజీ ఇంఛార్జ్‌ బోయ తిప్పేస్వామి ఇంట్లో 5 మండలాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐదు మండలాలకు చెందిన వైసీపీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్‌కి వైసీపీ టికెట్‌ ఇస్తే 50 వేల మెజార్టీతో ఓడిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అసమ్మతి నేతలు. ముసి ముసి నవ్వులు నవ్వితే మోసపోవద్దండి జగన్‌ సార్‌ అంటూ సీఎంకు సూచనలు చేశారు. అంతేకాదు ఒక వేళ వైసీపీ హైకమాండ్ ఉషశ్రీ చరణ్‌కి టికెట్‌ ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని అల్టిమేటం చేశారు. టీడీపీని ఓడించాలంటే స్థానిక నేతలకే టికెట్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు అసమ్మతి నేతలు.

Tags

Read MoreRead Less
Next Story