TTD : తిరుమల శ్రీవారికి వజ్రాలతో వైజయంతీ మాల అందించిన డీకే ఆదికేశవులు మనవరాలు

మరో విలువైన నగ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న ఒడికి చేరింది. మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్వి, మనవరాలు చైతన్య విలువైన కానుకను అందజేశారు. దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను శ్రీవారికి సమర్పించారు. ఈ మాలను తేజస్వి, చైతన్యలు.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా టీటీడీకి అందించారు. ఈ వైజయంతీ మాలను ఉత్సవ మూర్తికి అలంకరణకు వినియోగించనున్నారు. తిరుమల శ్రీవారికి మాత్రమే కాదు.. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను అందచేయనున్నారు. శృంగేరి పీఠాధిపతి ద్వారా వజ్రాలతో కూడిన నాలుగు హారాలను స్వామి వారికి బహూకరించారు. టీటీడీ ఈఓ అదనపు ఈఓకి ఇచ్చారు. ఇంతవరకు స్వామి వారికి వైజయంతి మాల లేదు వజ్రాలతో కూడిన బంగారు నగలను ఇవ్వడం సంతోషంగా ఉందిన్నారు చైతన్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com