AP : పది చేతుల వినాయకుడు.. ఎక్కడో తెలుసా?

AP : పది చేతుల వినాయకుడు.. ఎక్కడో తెలుసా?
X

ఎక్కడైన వినాయకుడికి ఎన్ని చేతులు ఉంటాయి.... రెండు లేదా నాలుగు చేతులు వుంటాయి కాని అనంతపురం జిల్లా, రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన వినాయకుడికి ఏకంగా పది చేతులు ఉన్నాయి. ఇక్కడి దశభుజ వినాయకుడు సతీసమేతంగా భక్తులకు అనుగ్రహిస్తున్నాడు. కుడివైపు ఉన్న ఈ బొజ్జగణపయ్యకు ఒక టెంకాయను సమర్పిస్తే కొరిన కోరికను తీరుస్తాడంటా ... అయితే మనం కూడా ఈ లంబోదరుడిని దర్శించుకుందాం.....

భారతదేశంలోనే అతి ప్రసిద్ధి పొందినటువంటి శ్రీదశభుజ మహా గణపతి దేవాలయం అనంతపురం జిల్లా, రాయదుర్గం పట్టణంలో వెలసింది. ఈ దేవాలయం దాదాపు 800 సంవత్సరాల క్రితం ఇక్కడ అప్పటి పాలకులు విజయనగరం రాజులు నిర్మించారు. ఇక్కడ విశేషం ఏమంటే... గణపతి విగ్రహం 15 అడుగులు ఎత్తు, 12 అడుగుల వెడల్పు గల ఏకశిలా విగ్ర హాన్ని వేదపండితులు గుర్తించారు.

ఇక్కడ ఆదివారం, మంగళవారం, సంకష్ట దినములలో ప్రత్యేక పూజలు జరపుకుంటారు. ఈ వినాకుడికి కుడివైపున తొండం వున్నందున సంకల్ప శిద్ధి వినాయకుడిగా భక్తులు కొలుచుకొంటారు. ఇక్కడ వచ్చిన భక్తులు సంకల్పంతో వినాయకుడికి ఒక టెంకాయ వుంచితే 41 రోజుల్లో ఆ కొరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడికి తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి వినాయక చవితి రోజు ఇక్కడ పండుగవాతావరణంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వినాయక చవిత సందర్భంగా ఈ దినం స్వామి వారికి వేలాది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగించారు. వాడవాడలా వినాయక మండపాల్లో వినాయకుడిని పూజించారు.

Tags

Next Story