APTET : డీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్.. టెట్ దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

APTET : డీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్.. టెట్ దరఖాస్తుకు ఇవాళే లాస్ట్
X

ఏపీలో టెట్ దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఇప్పటికే ఓ సారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. SEP 22 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. OCT 3 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫైనల్ కీని అక్టోబర్ 27న, ఫలితాలను నవంబర్ 2న విడుదల చేస్తారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇక ఏపీ టెట్ కు సంబంధించిన ఆన్ లైన్ మాక్ టెస్టులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వీటిని ఉచితంగా రాసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 22 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబరు 3వ తేదీన పరీక్షలు ప్రారంభమై…. 20వ తేదీతో ముగుస్తాయి. నవంబరు 2వ తేదీన తుది ఫలితాలు విడుదలవుతాయి.

ఏపీ టెట్ అప్లికేషన్ ప్రాసెస్….!

Step 1 : టెట్ రాసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

Step 2 : హోం పేజీలో కనిపించే Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3 : పేమెంట్ పూర్తి చేసిన సమయంలో జనరేట్ అయిన Candidate IDతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

Step 4 : లాగిన్ పై నొక్కితే మీకు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.

Step 5 : మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Step 6 : చివరిగా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

Tags

Next Story