Nellore District : గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం : డీఎస్పీ చెంచు బాబు

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం చర్యలు చేపట్టడం జరుగుతుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు తెలియజేశారు. నాయుడుపేటలోని డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నాయుడుపేట - చెన్నై జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీనివాసపురం అటవీ ప్రాంతంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2.50 లక్షల విలువచేసే 11.50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో జాన్ బ్లస్సన్, వినోద్, హర్షవర్ధన్, శ్రీకాంత్, సెల్వం, రాకేష్ అను ఆరు మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి అక్రమార్కులపై నిఘా పెట్టి గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నట్లు తెలిపారు. దర్యాప్తులో జాన్ బ్లెస్సన్ పై గతంలో కూడా గంజాయి కేసులు నమోదు ఉన్నాయని.. ప్రస్తుతం కూడా బయట ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి నాయుడుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో యువతకు సరఫరా చేస్తున్నట్లు తేలిందని... మరల ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా... గట్టి చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com