మాజీమంత్రి దేవినేని ఉమా అరెస్టుపై స్పందించిన డీఎస్పీ..!

మాజీమంత్రి దేవినేని ఉమా అరెస్టుపై స్పందించిన డీఎస్పీ..!
దేవినేని ఉమా కారులోంచి దిగకుండా పోలీసులను ఇబ్బంది పెట్టారని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు.

దేవినేని ఉమా కారులోంచి దిగకుండా పోలీసులను ఇబ్బంది పెట్టారని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఫిర్యాదు ఇవ్వాలని అడిగినా ఇవ్వకుండా శాంతిభద్రతలకు విఘాతం కలించేలా వ్యవహరించారని చెప్పారు. తన వర్గాన్ని రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా దేవినేని ఉమా ప్రోత్సహించారన్నారు. ఇరువర్గాల వారిపైనా కేసులు నమోదు చేసామన్న డీఎస్పీ.. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

అటు పోలీసుల సమక్షంలోనే దేవినేని ఉమపై దాడి జరిగిందని టీడీపీ నేత అశోక్‌ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోయాయన్న ఆయన.. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించి నందుకే ఉమపై అటాక్‌ చేశారని విమర్శించారు. పోలీసుల సమక్షంలో దాదాపు 100 మంది ఉమ కారుపై దాడి చేస్తే.. ఉమ పై పోలీసులు కేసులు పెట్టడం దారుణమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story