Visakhapatnam: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌.. 65 మంది ఒకేసారి..

Visakhapatnam (tv5news.in)

Visakhapatnam (tv5news.in)

Visakhapatnam: పాడేరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 65 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది.

Visakhapatnam: విశాఖ ఏజెన్సీ పాడేరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 65 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా అనారోగ్యానికి గురికావడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కేజిబివిలో మొత్తం 284 మంది విద్యార్థులు ఉండగా.. రాత్రి 65 మంది చిన్నారులు కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స జరుగుతోంది. ప్రాణపాయంలేదని వైద్యులు చెప్పడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

విషయం తెసుకున్న వెంటనే ఎమ్మార్వో సహా అధికారులంతా ఆస్పత్రికి చేరుకున్నారు. పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంపై ఆరా తీశారు. కలుషిత నీళ్లు తాగడం వల్లే వారు అస్వస్థతకు కారణమై ఉండొచ్చని ఎమ్మార్వో‌ ప్రకాశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి మణికుమారి, కిడారి శ్రవణ్‌ కుమార్‌, గిడ్డి ఈశ్వరి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story