Dussehra Holidays : తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి దసరా సెలవులు

Dussehra Holidays : తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి దసరా సెలవులు
X

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రకటన ప్రకారం ఇవాళ్టి నుంచి దసరా సెలవులు అమల్లోకి వచ్చాయి.ఏపీలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు,తెలంగాణలో అక్టోబర్ 3 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. అయితే విద్యార్థులకు నిన్న ఆదివారం కలిసి రావడంతో ఇప్పటికే హాలిడేస్ ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక స్కూల్స్ రీఓపెన్ అయ్యే అక్టోబర్ 3, 4న శుక్ర, శనివారాలు కావడంతో స్టూడెంట్స్ ఆదివారం మరుసటి రోజు సోమవారం(6న) బడిబాట పట్టే అవకాశముంది. సర్కారు జూనియర్ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో వీటిని కళాశాలలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రతీ కాలేజీకి ఫ్రీ ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా జేఈఈ, నీట్, ఎప్ సెట్ తదితర ప్రవేశపరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

Tags

Next Story