EARTHQUAKE: భూకంప భయంతో.. హడలిపోయిన తెలుగు ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలతో వణికిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించడం.. తీవ్ర కలకలం రేపింది. ములుగు కేంద్రంగా వచ్చిన భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పుడే తెలతెల్లవారుతుండగా... సంభవించిన వరుస భూ ప్రకంపనలతో కాసేపు అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలంగాణలోని భూప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురిచేశాయి. పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఏం జరుగుతుందో ప్రజలు అర్థం కాక హడలిపోయారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
ఉత్తరం నుంచి దక్షిణం, దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్లుండి కింద పడిపోవంతో ప్రజలు హడలిపోయారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో భూకంపం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, హైదరాబాద్, విజయవాడ, జగ్గయ్యపేట, రంగారెడ్డి, కృష్ణా జిల్లాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఈ పరిణామంతో జనం ఉలిక్కిపడి భయంతో వణికిపోతూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చాలాసేపటి
ములుగు జిల్లాలో ఈ ఉదయం 7:27 నిమిషాలకు భూకంపం సంభవించింది. ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. ఈ ప్రకంపనలతో ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటికి పరుగులు తీశారు. సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com