AP : వాలంటీర్ల విధులపై ఈసీ క్లారిటీ.. గ్రామ, వార్డు సిబ్బందికి కీలక బాధ్యతలు
పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election) రాష్ట్రాల్లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపై ఈసీ స్పష్టత ఇచ్చింది. ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికే అప్పగించాలని స్పష్టం చేసింది.
వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ సూచించింది. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లను అనుమతించవద్దని స్పష్టం చేసింది. దీంతో ఎన్నికలకోడ్ వచ్చిన వెంటనే వాలంటీర్ల వద్ద ఉండే ప్రభుత్వ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
వాలంటీర్లపై ఆశలు పెట్టుకున్న జగన్ రెడ్డి వారికి పెద్ద ఎత్తున బహుమతుల పేరుతో డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు అపోజిషన్ ఆరోపిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు తీసుకోవడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై ఆయన ఈసీకి లేఖ రాశారు. పరిశీలన జరిపిన ఈసీ ఎన్నికల విధుల్లోకి సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని అయితే.. కలెక్టర్లు, అధికారులకు సీఈవో సూచనలు చేసింది. ఈసీ సూచనతో ఎన్నికల ప్రధాన విధులు అప్పగించవద్దని సీఈవో రిటర్నింగ్ అధికారులకు లేఖలు రాశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com