AP: విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఈడీ ఆఫీసులో విచారణకు ఎంపీ హాజరయ్యారు. విజయసాయి రెడ్డిని 7 గంటలు ఈడీ అధికారులు విచారించారు. కాకినాడ సెజ్, సీ పోర్టు లిమిటెడ్ షేర్ల బదలాయింపు వ్యవహారంలో విజయసాయి రెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. మెుత్తం 25 ప్రశ్నలు అడిగారు. కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాయిరెడ్డిని ప్రశ్నించారు. " కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ నన్ను విచారించింది.. 25 ప్రశ్నలు అడిగారు.. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది.. కేవీ రావు నాకు తెలియదు అని చెప్పాను.. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు… కాకినాడ సీ పోర్ట్ విషయంలో కేవీ రావుకు ఎక్కడ తాను ఫోన్ చేయలేదు" అని అధికారులు చెప్పాని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
తప్పు చేస్తే శిక్షకు సిద్ధం
తాను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా సిద్ధంగా ఉన్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్ఫర్‌కు తనకు సంబంధం లేదని... కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. తనకు సంబంధం లేని విషయంలో తన పై ఆరోపణలు చేశారని విజయసాయి వెల్లడించారు.కేవీ రావును ఈడీ విచారణకు పిలవండి అని కోరినట్టు వెల్లడించారు.. రంగనాథ్ కంపెనీని ప్రభుత్వానికి ఎవరు పరిచయం చేశారని ఈడీ ప్రశ్నించింది.. తనకు సంబంధం లేదు అని చెప్పానని వివరించారు. తాను ఒక సాధారణ మైన ఎంపీని మాత్రమే.. శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవరు ఆపాయింట్ చేశారో తనకు తెలియదని చెప్పానని విజాయసాయి తెలిపారు. శరత్ చంద్ర రెడ్డితో ఉన్న సంబంధాలు కూడా అడిగారని.... కుటుంబ రీలేషన్ అని చెప్పాను అని పేర్కొన్నారు..
విజయసాయికి లుకౌట్ నోటీసులు
కాకినాడ సీ పోర్ట్ విషయంలో తనకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని విజయసాయిరెడ్డి వెల్లడించార.. లుక్ ఔట్ నోటీసులపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లానని.. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే తాను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీకి చెప్పానన్నారు.. విక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారు.. విక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదు.. 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com