Editorial: "విజయనగరంలో బరిలో టీడీపీ గెలుపు గుర్రాలు"

Editorial: విజయనగరంలో బరిలో టీడీపీ గెలుపు గుర్రాలు
విజయనగరం జిల్లాలో అధికరపార్టీపై తీవ్ర వ్యతిరేకత; ప్రతిపక్ష టీడీపీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ; అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న తెలుగు తమ్ముళ్లు; అసెంబ్లీలతో పాటు ఎంపీ స్థానం కైవసం దిశగా వ్యూహాలు; గెలుపు గుర్రాలనే బరిలో దించాలని అధిష్టానానికి విజ్ఞప్తులు

విజయనగరం జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయట. ప్రధానంగా టీడీపీలో ఈ వేడి కాస్త ఎక్కువగానే ఉందట. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పసుపు జెండా ఎగుర వేయాలని ఉవిళ్లూరుతున్నారట కార్యకర్తలు. అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు సరైన అభ్యర్థులను రంగంలోకి దించాలంటూ అధిష్ఠానానికి సూచిస్తోందట క్యాడర్. విజయనగరం పార్లమెంట్ స్థానానికి ఛార్మింగ్ ఉన్న లీడర్ ను క్యాడర్ ఇప్పటికే ఏంచేసుకుందట. గత ఎన్నికల్లో పోటీచేసిన విజయనగరం రాజ వంశీయులు పూసపాటి అశోక్ గజపతిరాజు ఒకరైతే. మాజీమంత్రి, బొబ్బిలి రాజ వంశీయులు సుజయ్ కృష్ణ రంగారావు మరొకరంట. వీరిలో ఎవరైనా ఎంపీ అభ్యర్థిగా వస్తే గెలిపించుకుంటామంటూ తమ గళాన్ని వినిపిస్తోందట క్యాడర్.

మరోవైపు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయట. ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావే కరెక్ట్ అంటున్నారట మరికొంతమంది తెలుగుతమ్ములు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, మచ్చలేని నేతగా సుజయ్ కృష్ణ రంగారావుకు పేరుంది. వ్యక్తిగత కారణాలతో గతంలో స్పీడ్ తగ్గించినా, ప్రస్తుతం బొబ్బిలితో పాటు జిల్లాలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజును తరచూ కలుస్తూ పార్టీ సంస్థగత అంశాలపై సుధీర్ఘంగా సమాలోచనలు జరుపుతున్నారట. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును కూడా ప్రత్యేకంగా కలిసి జిల్లా రాజకీయాలు, పార్టీ పరిస్థితి పై చర్చించారట. ఈసారి ఎలా అయినా అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలంటూ సుజయ్ కి చంద్రబాబు సూచించారట.

కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సుజయ్ యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారట. గతంలో దొర్లిన పొరపాట్లను సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారట. తన స్థానంతో పాటు మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో కూడా పట్టు సాధిస్తున్నారట. ఆయా నాయకులతో మాట్లాడుతూ స్థానిక సమస్యలపై గళం విప్పుతున్నారట. దీనికి తోడు బొబ్బిలి నియోజకవర్గం నుంచి తన తమ్ముడు బేబినాయన పోటీ కూడా దాదాపు ఖరారైందట. దీంతో ఇద్దరు కలసి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురువేయాలని రెడీ అయ్యారట.

Tags

Read MoreRead Less
Next Story