Editorial: వినాశకాలే విపరీత బుద్ది.. జగన్ మరో భస్మాసురడేనా !!

నాశనమైపోయే సమయం వస్తే విపరీతమైన ఆలోచనలు వస్తాయని నానుడి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు అందుకు సరైన ఉదాహరణ. మూడేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెబ్లీ స్దానాలకు 151 స్ధానాల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తున్న జగన్ బహుశా ఇప్పుడు పరిపాలనలో కూడా మరో చరిత్ర సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడేమో... కానీ అది ఆంధ్రప్రధేశ్ రాజకీయాల్లో మరో హిట్లర్ నీ, ముసోలినీని తలపించే మచ్చగా మిగిలిపోయే దిశలో సాగుతోందనిపిస్తోంది. సంక్షేమపాలన అందిస్తున్నామన్న స్వయం ప్రకటిత కీర్తనల్లో మునిగితేలుతున్న జగన్ తాను చేస్తున్న ప్రతి చర్యా ప్రజలు ఆమోదిస్తారు.. ప్రపంచం కీర్తిస్తుంది.. ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడతారన్న భ్రమల్లో ఉన్నారేమో ఆనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి భావప్రకటనా స్వేచ్చను అడుగడుగునా అడ్డుకుంటూ... తానూ తన ప్రభుత్వం చేసే ఏ పనినీ విమిర్శించే హక్కుగానీ, ఎత్తు చూపే స్వాతంత్రం కానీ వారికి లేవన్న స్వతం రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నారు. తూర్పగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటూ, ఇచ్చిన పర్మిషన్ సైతం రద్దుచేసి ప్రతిపక్షనాయకున్ని తిప్పలుపెట్టే ప్రయత్నాలు చేయడం ఈ కోవలేకే వస్తాయి. ఇది ఖచ్చితంగా అతన్నీ, అతని ఏకపక్ష నియంతృత్వ ధోరణిని ఆశించకూడని పాలకుడిగానే నిలబెడుతుంది.
చరిత్రలో తనకో పుట
వాస్తవానికి రాష్ట్రచరిత్రలోనే అఖండ మెజారితో గెలిచిన జగన్ బహశా ఆ అతివిశ్వాసం కలిగిన దురహంకారంతోనే ఈదిశగా నిర్ణయాలు తీసుకునేలా చూపుతున్నాయి కాబోలు. ఆయన పార్టీ అధికార పగ్గలు చేపట్టిన 2019 జూన్ నాటినుంచి మొదలు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగానూ, అధికార దురహంకార ధోరణిలోనూ ఉంటున్నాయి. ఆయన తీరును సున్నితంగానో, విమర్శనాత్మకంగానో లేవనెత్తి మార్చుకోవాలని సూచించిన వారందరినీ ఆయన శత్రు కూటమి సభ్యులుగా పరిగణించడం ఖచ్చితంగా ఆయనకే భస్మాసుర శాపం లా మారబోతోంది. ప్రభుత్వ తీరు సరిగాలేదు, లేదా ఫలానా విశయంలో ఇలాచేసుంటే బాగుంటుందన్న సూచనలు చేసిన రఘురామకృష్ణం రాజులాంటి స్వంత పార్టీ నేతలైనా, సలహాదారులుగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టులైనా ఆయన ఇస్టుల జాబితానుంచి తొలగించి వ్యతిరేకుల జాబితాలో చేర్చుకుని శత్రు పక్షాన్ని స్వయంగా పెంచుకుంటున్నారు.
అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే చంద్రబాబు నాయుడుపై కక్షతోనో లేదా అయిష్టంతోనో ఆయన కట్టించిన ప్రజావేదిక కూలగొట్టించి జగన్ మార్కు అపరాజకీయం టేస్టు చూపించడం మొదలుపెట్టారు. నిబందనల పేరుతో కూల్చిపేతలకు పాల్పడంటం ఆయన తీరు పట్ల మొట్టమొదటి చర్చనీయాంశమైంది. దీన్ని సమర్దించుకునేందుకు జగన్ ఇది మాత్రమే కాదు ఇలాంటి కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయంటూ చేసిన ప్రకటనలు ఆయన మనస్తత్వం ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. అంతే కాదు రాష్ట్ర రాజధాని విషయంలోనూ తాను తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడేవుండాలన్న అహం ప్రదర్శించారు. ఇది తప్పా ఒప్పా అన్న చర్చ చేసే అధికారం శాసనమండలికి సైతం లేదంటూ నియంతృత్వంగా వ్యవహరించారు. మా పార్టీకి మెజారిటీ వుంది కాబట్టి మాకడ్డుచెప్పిన శాసన మండలిని రద్దుచేస్తామంటూ తీర్మాణం చేయడం మరో పరాకాష్ట. రాజధానికి భూములిచ్చిన రైతులు తమకిచ్చిన హామీలేంటని నిరసన తెలుపుతుంటే 1000రోజుల వాళ్ల ఆర్తనాదాలు అరణ్యరోదనగానే మిగిలిపోయాయి. కనీసం ఇప్పటికైనా వారితో చర్చించేందుకు ముందురాని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నియంత పాలకుల జాబితాలో చేర్చదగినవాడే.
పత్రకాస్వేఛ్చా.. అబ్బబ్బే..
ప్రజాస్వామ్యంలో మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అంటారు. పాలకుల తప్పొప్పలను ఎత్తిచూపడం వారి ప్రధాన కర్తవ్యం. ఏ పాలనలోనైనా తప్పడు నిర్ణయాలుంటాయి.. తమను కీర్తించడం మాత్రమే చాయిలి లేదంటే ఆగ్రహం చవిచూడాల్సొస్తందన్న తీరున జగన్ వ్యవహరిస్తున్నారు. అసంబద్ద కారణాలు చూపి మీడియా స్వేఛ్చకు సంకెళ్లేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలతో కలిసి కుట్ర పన్నుతున్నారని ఎదురు దాడి చేస్తూ జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు సైతం పెడుతున్నారు. టీవీ5 సహ పలు వార్తా సంస్తల జర్నలిస్టులపై జగన్ సర్కారు పెట్టిన రాజద్రోహం కేసుల ఆయనకే దేశవ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టాయి. అయిన ఆయన తీరులో మార్పులేదు.. తన ప్రతి సమీక్షా సమావేశంలోనూ మీడియాను శత్రువుగా చెప్పుకుంటూ పత్రికా స్వేఛకు తాను బద్దవ్యతిరేకిననే ఆయనే ప్రకటించుకుంటున్నాడు.
కోపం నరం తెగిందన్న వైఎస్సార్..
రాజకీయ నాయకులుగా ప్రజాస్వామ్య భాగస్వాములుగా జగన్ ను మించిన అనుభవమున్న ఎందరో నేతలు ఆయనకంటే ఎక్కువ విమర్శలే ఏదుర్కొన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు , రాజకీయ దాడులను జగన్ను మించే వారు చూసారు. సాక్షాత్తు జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డిని ప్రతిపక్షాలు ఫాక్షనిస్టన్నా, అవినీతి పరుడన్నా ఆయన తట్టుకుని నిలబఢ్డ తీరునుంచి జగన్ ఏమాత్రం పాఠం నేర్చుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్య మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షనాయకుల పట్ల వ్యవహరించిన తీరు ఆయమపై అందరికీ గౌరవాన్ని పెంచింది. ఆధికార భాద్యత వచ్చాక నా కొపంనరం తెగిపోయింది. అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరించడం మంచుంటే పాటించడం అలవాటైందన్న వైఎస్ఆర్ కాంమెంట్ గ్రేట్. తెలంగాణ ఉద్యమసమయంలో ప్రతిరోజూ సీమాద్ర పాలకులు , పెట్టుబడిదారులపై ఆరోపణలు విమర్శలు గుప్పించిన ఇప్పటి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ రాష్ట్రం ఆవిర్భవించి తాను సీఎం పదవి చేపట్టిన మరుక్షణమే అందరూ తనవాళ్లే అన్నాడు. తన రాజకీయ వ్యూహాలు అమలుచేస్తూనే ప్రతిపక్షనాయకులకు సముచిత గౌరవం కల్పించడం ద్వారా విద్వేశాలకు తావిస్తాడేమో అన్న తనపై ఉన్న అనుమానాలనుంచి పాలనా దక్షుడు, పెద్దమనిషి అన్న ఇమేజ్ సాధించుకోగలిగాడు.
విపరీత ఆలోచనలకు విపరీత ఫలితాలు తప్పవు.
జగన్ మాత్రం అనుభవాల పాఠాలు నేర్చుకోవడంలో విఫలమౌతూనే వున్నాడు. అను క్షణం కక్షపూరిత వైఖరితో ప్రతిపక్షనాయకులను తాత్కాలికంగా ఇబ్బందిపెట్టగలడేమోగానీ ఆయన ప్రభుత్వం, పోలీసుల ద్వారా చేపడుతున్న చర్యలు ప్రజల్లో మాత్రం జగన్ ను ఓ ఫాక్షన్ రాజకీయాల బానిసగానే నిలుపుతాయి. ప్రజల్లో కూడా ఆయన తీసుకున్న కొద్దిపాటి మంచి నిర్ణయాలను కేవలమంటే కేవలం ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ రాకూడదనే రాజకీయ కారణంతోనే చేసాడు కానీ ప్రజలకోసం చిత్తశుద్దితో చేసింది కాదనే భావన కలిగేలా వ్యవహరిస్తున్నాడు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు ఈ ధోరని గమనించే తూర్పుగోదావరి పర్యటనలో కీలక విశయం చెప్పాడు.. మొదట సహాయనిరాకరణ, తర్వాత ప్రతిఘటన యాత్ర ఆతర్వాత అధికారంనుంచి పారద్రోలే లా ప్రజలు కదులుతున్నారన్నాడు. ఈ జగన్ వ్యవహార శైలే అందుకు కారణమని భస్మాసురుడికి కూడా జగన్ లానే ఎవరూ ఏమీ చేయలేనంతటి వరప్రసాదం దక్కినా అహంకారంతో తనను తానే భస్మంచేసుకునేలా చేసింది. జగన్ కు కూడా ఆ దశ సాక్షాత్కారం కావడానిక మరో సంవత్సరం మాత్రమే వుందేమో!!. వినాశకాలే విపరీత బుద్ది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com