Editorial: కర్నూల్ వైసీపీలో ఎమ్మెల్సీ రగడ.

Editorial: కర్నూల్ వైసీపీలో ఎమ్మెల్సీ రగడ.
"ఏపీలో ఎమ్మెల్సీ రగడ".. జగనన్న కొత్త బాధితుల జాబితా విడుదల; గంపెడాశలతో ఉన్న నేతలకు భంగపాటు; వాల్మీకులకే మళ్ళీ పదవా అంటూ అసహనం; నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి జ్వాలలు; బీసీలంటే బోయలేనా అనే ప్రశ్నలు


స్థానిక సంస్థల mlc కోటాలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి అధోనికి చెందిన డాక్టర్ మధు సుధన్ ను వైసీపీ అధినేత జగన్ ఎంపిక చేశారు. డాక్టర్ మధు సూదన్ ఇప్పటికే రాష్ట్ర బోయ, వాల్మీకి ఫెడరేషన్ ఛైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. మళ్లీ మధుసూదన్ కే mlc పదవిని జగన్ కేటాయించడంపై సొంతపార్టీ నేతలే అసంతృప్తితో రగిలిపోతున్నారట. కర్నూలు, నంద్యాల నుంచి mlc పదవి ఆశించి భంగపడ్డ నేతలు తమ గోడు ఎవరితో చెప్పుకోవలో అర్థంకాక తలలు పట్టేసుకున్నారట. ఎందుకు జగన్ ఇలా చేశాడు.. అంటూ అనుచరులు, కార్యకర్తలతో తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారట.

కర్నూలు నుంచి mlc టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెరనేకల్ సురేందర్ రెడ్డి. పార్టీని నమ్ముకుని ఆది నుంచి పని చేస్తున్నా ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని సురేందర్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొందట. గతంలో వైసీపీ సిటీ కన్వీనర్ పోస్ట్ విషయంలో అన్యాయం జరగ్గా... ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ పక్కన పెట్టేశారు. మళ్లీ ఇప్పుడు mlc ఎంపికలోనూ అన్యాయం చేశారని సురేందర్ రెడ్డి వర్గంలో ఆవేదన, ఆందోళన, అసంతృప్తి నెలకొందట. ఇటు నంద్యాల జిల్లా నుంచి గంగుల, చల్లా కుటుంబాలకు అవకాశం దక్కలేదు. నంద్యాల జిల్లాలో రాజకీయ పరంగా రెండూ అగ్ర కుటుంబాలే. గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. గంగుల ప్రభాకర్ రెడ్డిది మార్చి 29తో పదవి కాలం పూర్తి కానుంది. ఇటీవలే అనారోగ్యంతో mlc చల్లా భగీరథ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. చల్లా కుటుంబానికి mlc పదవితో న్యాయం చేస్తానని.. సీఎం జగన్ భగీరథ రెడ్డి మృతి చెందినప్పుడు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. కొద్ది రోజుల కిందటే సీఎం జగన్ ను చల్లా భగీరథ రెడ్డి భార్య, అటు చల్లా రామ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తనకు మరో అవకాశం ఇవ్వాలని జగన్ ని గంగుల కూడా కోరాడట. అయితే 18 మంది mlcఅభ్యర్థుల భర్తీలో చల్లా, గంగుల కుటుంబాలకు జగన్ చోటు కల్పించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. నంద్యాల జిల్లా నుంచే mlc పదవి ఆశించారు మరో వైసీపీ సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి. మొదటి నుంచి నంద్యాలలో పార్టీని నమ్ముకుని పని చేస్తున్నా.. రాజగోపాల్ రెడ్డి సేవలను మాత్రం జగన్ సర్కారు గుర్తించలేదన్న విమర్శలున్నాయి. నంద్యాల ఉపఎన్నికల సమయంలో, 2019 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి నంద్యాల వైసీపీ టికెట్ ఆశించినా దక్కలేదు. నంద్యాల ఉపఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి, 2019 ఎన్నికల్లో మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవికి టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. mlcతోనైనా గుర్తింపు లభిస్తుందని ఆశించిన రాజగోపాల్ రెడ్డి వర్గానికి మళ్లీ తీవ్ర నిరాశే మిగిలిందట సామాజిక న్యాయం అంటూ ఊదర గొట్టుకుంటున్న జగన్ కి కర్నూలు జిల్లాలో బీసీలు అంటే బోయవాల్మీకులేనా అంటూ వైసీపీలోని మిగతా బీసీలు రగిలి పోతున్నారట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బోయవాల్మీకి సామాజిక వర్గానికే mlc కేటాయించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అత్యధికంగా ఉన్న కురని, కురువలను గుర్తించలేదని గుర్రుగా ఉన్నారట. రెడ్డి వర్గాల్లోనూ లోలోపల అసంతృప్తి రగులుతోందట. ఇప్పటికే వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ మధు సూదన్ కి మళ్లీ mlc పదవి ఇవ్వడం ఏంటని సొంత పార్టీ బీసీలే రగిలిపోతున్నట్లు టాక్. ఆలూరు Mla గుమ్మనూర్ జయరాంకి బోయవాల్మీకి కింద రెండోసారి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి, కర్నూలు మేయర్ రెండు పదవలూ వాల్మీకి సామాజిక వర్గంకి చెందిన బీవై రామయ్యకు కేటాయించారు. జిల్లా గ్రంథాలయం ఛైర్మన్ పదవి వాల్మీకి సామాజిక వర్గంకి చెందిన సుభాష్ చంద్రబోస్ కి కేటాయించారు.

తాజాగా ఇదే సామాజిక వర్గానికే మళ్ళీ mlc పదవి కేటాయింపు అధికార పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చాప కింద నీరులా.. నివురు గప్పిన నిప్పులా ఉన్న.. ఈ అసంతృప్తి రానున్న ఎన్నికల్లో జగన్ సర్కారును విస్పోటనంలా బద్దలు కొట్టబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story